కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

by Taduka Kalyani |

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
X

దిశ, కాగజ్‌నగర్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, స్టోర్ రూమ్, రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి మరియు హాజరు రిజిస్టర్‌ను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. అనంతరం రూరల్ ఎస్ఐ సందీప్ కుమార్, స్టేషన్ సిబ్బందితో ఎస్పీ సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాత్రిపూట ప్యాట్రోలింగ్, పికెటింగ్‌లను కచ్చితంగా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే వారి పట్ల ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story