- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫీజు రీఫండ్ అప్‌డేట్ విడుదల చేసిన NTA
నీట్ యూజీ అప్లికేషన్ ఫీజు రీఫండ్‌పై జాతీయ పరీక్షల సంస్థ (NTA) ముఖ్యమైన ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ (NEET UG-2026) అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) కీలక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు రీఫండ్ ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగానే రీఫండ్ సొమ్ము నేరుగా వారి అకౌంట్లలో జమ చేయబడుతుందని NTA స్పష్టం చేసింది. ఎలాంటి ఆలస్యం లేకుండా డబ్బులు జమ కావాలంటే, పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అభ్యర్థులు ఒకసారి సరిపోల్చుకోవాలని సూచించింది.
నకిలీ కాల్స్, లింకులతో బీ కేర్‌ఫుల్..
అయితే, రీఫండ్ త్వరగా వచ్చేలా చేస్తామంటూ వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఆన్‌లైన్ లింకుల పట్ల అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని NTA హెచ్చరించింది. రీఫండ్ ప్రక్రియ కోసం ఎప్పుడూ కూడా అభ్యర్థులు ఓటీపీ (OTP)లు, పాస్‌వర్డ్‌లు, యూపీఐ (UPI) పిన్‌లు అడగదనని ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. ఇక బ్యాంక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేయడంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, పొరపాటున తప్పుడు డీటెయిల్స్ ఇచ్చిన వారికి NTA ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష ముగిసిన తర్వాత తప్పులను సరిదిద్దుకుని, సరైన బ్యాంక్ వివరాలను నమోదు చేయడానికి మరో అవకాశం కల్పిస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది.






