తప్పుడు సర్టిఫికేట్లతో.. వ్యవసాయ భూమి కాజేసిండ్రు

by Taduka Kalyani |

తప్పుడు సర్టిఫికేట్లతో వ్యవసాయ భూమిని కాజేశారని ఆరోపిస్తూ ఓ వృద్ధుడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కే హైమావతి కి ఫిర్యాదు చేశారు.

తప్పుడు సర్టిఫికేట్లతో.. వ్యవసాయ భూమి కాజేసిండ్రు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తప్పుడు సర్టిఫికేట్లతో వ్యవసాయ భూమిని కాజేశారని ఆరోపిస్తూ ఓ వృద్ధుడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కే హైమావతి కి ఫిర్యాదు చేశారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన దండుగుల మల్లయ్య, దండుగుల గురువయ్య, దండుగుల కనయ్య, దండుగుల చిన్న మల్లయ్యలు అన్నదమ్ములు. 40 సంవత్సరాల క్రితం వృత్తిరీత్యా దండుగుల చిన్న మల్లయ్య పెద్ద గుండవెల్లి గ్రామానికి వెళ్లి స్థిరపడ్డాడు. సొంత గ్రామంలో అన్నదమ్ముల తో పాటుగా చిన్న మల్లయ్యకు ఎకరం 10 గుంటల భూమి ఉంది. ఆ భూమిని కనయ్యకు కవులుకు ఇచ్చాడు. 2023లో పెద్ద మల్లయ్య కుమారుడు దండుగుల మల్లయ్య మృతి చెందాడు. ఇదే అదనుగా సదరు డెత్ సర్టిఫికెట్ తో మల్లయ్య భార్య వరసకు మామ అయిన చిన్న మల్లయ్య కు సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో పౌతి మార్చుకున్నట్లు ఆరోపించారు. పౌతి మార్పు రద్దు చేయాలని దండుగుల చిన్న మల్లయ్య కుటుంబ సభ్యులు కోరారు.

Next Story