- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పినపాక గడ్డ కాంగ్రెస్ అడ్డ : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
సీతంపేట గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం నాడు ప్రారంభించారు.

దిశ, పినపాక : మండల పరిధిలోని సీతంపేట గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం నాడు ప్రారంభించారు. సీతంపేట గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మెరుగైన విద్యా, పోషకాహార సౌకర్యాలు అందించే లక్ష్యంతో రూ. 2.50 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. తదుపరి ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని జీవీఆర్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోవటమే లక్ష్యం అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది మనమే అన్నారు. పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అడ్డా అన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్య పడవద్దన్నారు. ఈ సందర్భంగా మండలంలోని లబ్ధిదారులకు 17 సీఎం రిలీఫ్ ఫండ్, 30 కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.






