- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వానకాలం సీజన్ కు సంబంధించి ఎరువులు, విత్తనాల విక్రయాలపై క్రమబద్ధీకరణ నియంత్రణపై కొడంగల్ నియోజకవర్గం వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు విత్తనాలను విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలని ఆయన తెలిపారు. ఎవరైనా డీలర్లు నిర్దేశించిన వాటి కంటే ఎక్కువ ధరలకు విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. నకిలీ విత్తనాలు బ్లాక్ మార్కెట్లలో విత్తనాలు నిషేధిత విత్తనాలు విక్రయించినట్లయితే అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు. జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రిజిస్టర్ లో నమోదు చేయాలి
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రైతు బీమ రైతు భరోసా తదితర పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. విత్తనాల పంపిణీకి సంబంధించి రిజిస్టర్ లో నమోదు చేయాలని అదేవిధంగా రైతుల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు ఎరువుల విత్తనాల నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లలో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఇతర శాఖల అధికారులను భాగస్వాములను చేసి రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సన్న రకం బియ్యాన్ని పండించేందుకు రైతులను ప్రోత్సహించడం జరుగుతుందని ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. సన్న రకం వరిని సాగుచేసిన వారికి 500 రూపాయలు బోనస్ చెల్లించడం జరుగుతుందని ఇట్టి విషయంపై రైతుల్లో అవగాహన కల్పించి జిల్లాలో సన్నరకం వరిని సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు జిల్లా వ్యవసాయ అధికారి రాజా రత్నం వ్యవసాయ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.






