- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాలలో భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..
గద్వాల పట్టణంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు.

దిశ, గద్వాల క్రైం: గద్వాల పట్టణంలో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. పట్టణంలోని భీమ్ నగర్‌లో తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 9 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ. 7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రెక్కీ నిర్వహించి చోరీ..
నిందితుల్లో ఒకరు వెల్డింగ్ పని చేస్తుండగా, మరొకరు మేస్త్రీగా పనిచేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించి, విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో వీరు దొంగతనాలకు అలవాటు పడ్డారు. పథకం ప్రకారం, భీమ్ నగర్ పరిసరాల్లో బైక్‌పై తిరుగుతూ, తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించారు. జూన్ 10న ఒక ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ప్రధాన నిందితుడు మహబూబు (19), చెనుగోనిపల్లి గ్రామం, గద్వాల మండలం. ఇతనితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు...
నిందితుల నుంచి 9 తులాల బంగారం (గొలుసు, మంగళసూత్రం, జుంకాలు, చెవి రింగులు, ఉంగరాలు, ముక్కు పుల్ల), 60 తులాల వెండి, రూ. 7,000 నగదు, చోరీకి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు
జిల్లా ఎస్పీ కె. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో గద్వాల సీఐ శ్రీను, ఎస్సై కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల పుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి, జూన్ 15న ఉదయం నిందితులను చెనుగోనిపల్లి రహదారి వద్ద పట్టుకున్నారు. కేసును ఐదు రోజుల్లోనే ఛేదించిన సీఐ శ్రీను, ఎస్సై కళ్యాణ్, సిబ్బంది ఇంద్రయ్య, కిరణ్, రామకృష్ణలను ఎస్పీ అభినందించారు.






