హోంమంత్రిని కించపరుస్తారా: TDP స్టేట్ చీఫ్ తీవ్ర అభ్యంతరం

by Vemula.Srinu Prasad |

హోంమంత్రి అనితను మేకప్ మంత్రి అని మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్ నాథ్ అభివర్ణించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు...

హోంమంత్రిని కించపరుస్తారా: TDP స్టేట్ చీఫ్ తీవ్ర అభ్యంతరం
X

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి అనిత(Home Minister Anita)ను ‘మేకప్ మంత్రి’ అని మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్ నాథ్(Former Minister and YCP leader Amarnath) అభివర్ణించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(TDP State President Palla Srinivasa Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎస్సీ మహిళను అలా అనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మహిళా లోకాన్ని కించపరుస్తూ అమర్ నాథ్ మాట్లాడారని మండిపడ్డారు. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మహిళను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. నాయకులు రాజకీయ హద్దుల్లో ఉండాలన్నారు. లేని పక్షంలో ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.

కాగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సరసయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ హోంమంత్రి అనిత మేకప్ మంత్రి అని వ్యాఖ్యానించారు. ఆమె ఎండలో నిలబడితే మేకప్ కరిగిపోతుందని సెటైర్లు వేశారు. దీంతో టీడీపీ నేతలు, మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపర్చడం వైసీపీ నైజమని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను అసలు సహించేదేలేదని హెచ్చరించారు.

Next Story