ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ!

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ (Telangana Cabinet Meeting) కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. మెట్రో టేకోవర్‍పై సందిగ్ధత ఏర్పడడంతో నెక్ట్స్ ఏం చేయాలన్న అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందునా ఈ అంశంపై కూడా మంత్రి వర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎలక్ట్రానిక్ విధానంలో జరగనుంది. రాష్ట్రంలో ఇకపై ఈ-కేబినెట్ మీటింగ్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. పరిపాలనలో పేపర్ లెస్ విధానం తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు.

Next Story