ప్రజల భద్రతతో పాటు సంక్షేమానికి కృషి : ఎస్పీ నితిక పంత్

by Batti.Sumithra |

ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు.

ప్రజల భద్రతతో పాటు సంక్షేమానికి కృషి : ఎస్పీ నితిక పంత్
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం తిర్యాణి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో గిరిజనులకు 87 సోలార్ లైట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఇటువంటి సామాజిక సేవాకార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

విద్యుత్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారతాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదాకు కూడా సోలార్ శక్తి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ కేవలం చట్ట అమలు. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, భద్రత, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుందని తెలిపారు. అలాగే రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతునే సమాజ సేవలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అనిత రెడ్డి, వెంకటేశ్వరి, సీఐ సంజయ్, ఎస్ఐలు సుబ్బారావు, సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story