- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐపైనే ఎక్కువ ఆధారపడుతున్నారా? ఈ రిస్క్ పొంచి ఉంది జాగ్రత్త!
కొందరు ఏఐని ఎమోషనల్ సపోర్టర్‌గా, వ్యక్తిగత భాగస్వామిగా భావిస్తూ భ్రమలకు లోనవుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తున్న కాలమిది. దీని రాకతో ప్రపంచమే మారిపోతోంది. అనేక విషయాల్లో మానవుకలు సౌకర్యాన్ని, కొత్త దనాన్ని అందిస్తున్నది. అయితే అదే సందర్భంలో దీని అధిక వినియోగం హ్యూమన్ బిహేవియర్‌పై, జీవన పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఏర్పడుతోందని మానసిక నిపుణులు(Psychologists) చెబుతున్నారు. ప్రతీదానికి ఏఐపై ఆధారపడేవారిలో ‘ఏఐ సైకోసిస్(AI Psychosis)’ అనే కొత్త మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇవి పెరిగే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సంబంధాలపై ప్రభావం
ప్రస్తుతం అనేకమంది క్యారెక్టర్ ఏఐ, చాట్‌పీజీటీ వంటి మోడల్స్‌ను, పలు ఇతర ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలను వర్క్, కన్వర్జేషన్, ఇన్ఫర్మేషన్ విషయంలో ఉపయోగించుకుంటున్నారు. యువతలో అనేకమంది చాట్‌బాట్స్‌తో సంభాషిస్తూ ఎమోషనల్‌గానూ కనెక్ట్ అయిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఒక వ్యక్తికి మరో వ్యక్తి తోడుగా ఉండే అవసరాన్ని కూడా నేడు ఏఐ తీర్చేస్తోంది. క్యారెక్టర్ ఏఐ చాట్‌బాట్‌లతో సంబంధాలు (Relationship with AI) కొనసాగిస్తున్నామంటూ.., వాటినే తమ ప్రియమైన వ్యక్తులుగా, భాగస్వాములుగా భావిస్తున్నవారిని మనం చూస్తున్నాం. ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్ వంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు చాట్ బాట్‌లను తమ సొంత వ్యక్తులుగా, వ్యక్తిగత సహాయకులుగా భావిస్తూ పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటిస్తున్న వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ విధమైన కనెక్షన్ నార్మల్‌గా ఉంటే పర్లేదు. కానీ ఏఐతో ఎక్కువగా సంభాషించిన తర్వాత వాస్తవికతతో సంబంధం కోల్పోతున్నారని, ఇది అస్త వ్యవస్త ఆలోచనలకు, భ్రాంతులకు, తప్పుడు నమ్మకాలకు దారితీస్తోందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
అధిక వినియోగం.. అనర్థదాయకం
ఏఐతో ఎక్కువగా కనెక్ట్ ఇంటరాక్ట్ అయి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయి మానవ సంబంధాలను విస్మరించడం, భ్రమల్లో కూరుకుపోవడం వంటి లక్షణాలు కూడా నేటి యువతలో కొందరు అనుభవిస్తున్నారని, గతంలో ఇటువంటి మానసిక సమస్యలతో పలువురు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చేరారని ప్రముఖ జపనీస్ కంపెనీ ‘సకాటా నివేదిక’ వెల్లడించింది. అయితే ఏఐ సాంకేతికత నేరుగా ఎటువంటి ప్రభావం చూపకపోవచ్చు. టెక్ అడిక్షన్స్‌కు తోడుగా నిద్రలేమి, ఒంటరితనం, మత్తు పదార్థాలు, మత్తు పానీయాల సేవనం, మానసిక ఒత్తిడి వంటివి కూడా ఇక్కడ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ఏఐ అధిక వినియోగం (Overuse of AI) కొందరిలో మానసిక రుగ్మతలను, భ్రమలను, బలహీనతలను పెంచే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే ‘ఏఐ సైకోసిస్’ అని కూడా పిలుస్తున్నారు.






