- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొలిచిన వారికి కొంగు బంగారం (డిండి) కట్ట మైసమ్మ
కొలిచిన వారికి కొంగుబంగారంగా డిండి కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది.కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తుల3.3.

దిశ, ఉప్పునుంతల : కొలిచిన వారికి కొంగుబంగారంగా డిండి కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది.కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తుల3.3. ప్రగాఢ నమ్మకం.1943 నిజాం నవాబు కాలంలోని ప్రభుత్వంలో కొలువుదీరింది ఈ దేవాలయం.డిండి ప్రాజెక్ట్ కట్టకు అమ్మవారిని రక్షణగా ఏర్పాటు చేసినట్లు పురాణంలో పెద్దలు తెలుపుతున్నారు.
కొత్త కమిటీపై కోటి ఆశలు
శ్రీశైలం - హైద్రాబాద్ నేషనల్ హైవే ఎన్ హెచ్ 765 కు అనుకొని ఉండటంతో అమ్మవారికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యాలనే సంకల్పంతోనే ఎండోమెంట్ ద్వారా కొత్తగా ఇటీవలే కమిటీని నియమించారు. యువ నాయకుడు లాతిపూర్ గ్రామ వ్యక్తి ఎడ్ల నరేష్ యాదవ్ చైర్మన్ గా ఏకగ్రీవ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి మినీ మైసిగండిగా తీర్చిదిద్దాలని ఆయన బలమైన కోరిక
ఆలయ డెవలమెంట్ కోసం కొత్త ఆలోచనల కొత్త అడుగులు
ఆలయాన్ని అన్ని హంగులతో నిర్మించాలని దానికి ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో ప్రభుత్వ నిధులు 50 లక్షలు ప్రకటించారని తెలిపారు. కళ్యాణ మండపం,భక్తుల సౌకర్యార్థం మేరకు మరుగు దొడ్లు, వచ్చిన భక్తులకు దాహార్తి తీర్చడానికి ఫిల్టర్ వాటర్,అమ్మవారి చెంతనే సేద తీరి నిద్ర చేయాలనుకునే భక్తులకోసం వసతి గృహాలు,పెరుగుతున్న భక్తుల అవసరాల నిమిత్తం మరొక బోరు సదుపాయం,వెలుతురు సదుపాయాన్ని కల్పించడానికి పెద్ద పెద్ద హైమాక్స్ లైట్లు, పటిష్టమైన భద్రత కోసం సీసీ కెమెరాలు,అమ్మవారి రోజువారి అలంకారం,అమ్మవారి కంకణం,లడ్డు,పులిహోర ఏర్పాటుకు సన్నాహాలు,వాహనపూజ,నిత్య నైవేద్యం,కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు.దేవాలయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు మొక్కల పెంపకం చేపట్టి గ్రీన్ పార్క్ ఏర్పాటు కు కసరత్తు కొనసాగుతుంది.
దాతలు ముందుకొస్తే మరింత అభివృద్ధి
నూతన ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకొస్తే మరింత అభివృద్ధి కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అయల చైర్మన్ ఎడ్ల నరేష్ యాదవ్ కోరారు.మరో మైసిగండిలా డిండి కట్ట మైసమ్మ ఆలయం తీర్చిదిద్దాలని స్థానికుల,అచ్చంపేట నియజకవర్గ ప్రాంత ప్రజల కోరిక అందరి కోరిక మేరకు ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందిస్తే సాధ్యమవుతుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. m






