నాకు ఆ హీరోయిన్‌తో గట్టి పోటీ ఉండేది: మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

రోజాతో హెల్తీ కాంపిటీషన్ ఉండేదని మీనా చెప్పుకొచ్చింది.

నాకు ఆ హీరోయిన్‌తో గట్టి పోటీ ఉండేది: మీనా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అనేక భాషల్లో సినిమాలు చేసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె, మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం 3’ అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తోటి హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మీనా మాట్లాడుతూ... “నాతో పాటు రమ్యకృష్ణ, రోజా, రంభ, సౌందర్య, నగ్మా వంటి హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. అయితే మా అందరిలో నాకు ఎక్కువగా పోటీ రోజాతో ఉండేది. నేను, రోజా చాలాసార్లు సినిమాల విషయంలో పోటీ పడ్డాం. ఏదైనా సినిమాకు నా డేట్స్ అందుబాటులో లేకపోతే నిర్మాతలు రోజాను తీసుకునేవారు. అలాగే రోజా డేట్స్ ఖాళీగా లేకపోతే నన్ను సంప్రదించేవారు. ఇలా మా ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. అయితే మా మధ్య పోటీ ఎప్పుడూ హెల్తీగానే ఉండేది. మేము స్క్రీన్‌పై మాత్రమే పోటీ పడేవాళ్లం. బయట కలిసినప్పుడు మాత్రం ఎంతో సరదాగా గడిపేవాళ్లం.

షూటింగ్ గ్యాప్‌లో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడేవాళ్లం. వీలు దొరికితే బయటకు వెళ్లి ఫుడ్ కూడా తినేవాళ్లం” అని చెప్పుకొచ్చింది. అలాగే మా తోటి హీరోయిన్లు మాత్రమే కాదు, మా సీనియర్స్ కుష్బూ, రాధిక గారు కూడా మాతో ఎంతో స్నేహంగా ఉండేవారు. ఇప్పటికీ వారికి ఎంతో గౌరవం ఉందని మీనా తెలిపింది. ఇక ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినా సౌందర్య స్థానం ప్రత్యేకమని, ఆమె ఎంతో మంచి వ్యక్తి అని మీనా పేర్కొంది. నాతో కూడా చాలా బాగా ఉండేది. మా ఇద్దరి మధ్య కూడా హెల్తీ పోటీ ఉండేది. ఆమె నాకు మంచి స్నేహితురాలు అంటూ సౌందర్య గురించి మీనా చెప్పుకొచ్చింది.

Next Story