మ్యాగీలో పురుగులు.. కంపెనీ వివరణ చూస్తే ఖంగుతినాల్సిందే !

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-13 09:52:07  IST  )

మ్యాగీ నూడుల్స్ లో పురుగులున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై జూన్ 12న కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి.

మ్యాగీలో పురుగులు.. కంపెనీ వివరణ చూస్తే ఖంగుతినాల్సిందే !
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాగీ నూడుల్స్ లో పురుగులున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై జూన్ 12న కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ అయిన నెస్లే ఇండియాను.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు వివరణ కోరాయి. మ్యాగీ ప్యాకెట్ లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు అవాస్తవమని సదరు కంపెనీ పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ లో.. అన్ ఐడెంటిఫైడ్ అకౌంట్ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయని, FSSIA ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని పేర్కొంది. మ్యాగీ నూడుల్స్ లో పురుగులున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. కేవలం అవి తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన ఆరోపణలుగా తెలిపింది.

ఆరోపణలు, ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఇప్పటి వరకూ తమకు ఎలాంటి శాంపిల్స్ అందలేదని సంస్థ వెల్లడించింది. అలాగే సంబంధిత వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించినా.. ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. ఆరోపణలు వచ్చిన నమూనాలతో పాటు.. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర నమూనాలపై కూడా నాణ్యత పరీక్షలు నిర్వహించినట్లు నెస్లే వెల్లడించింది. తమ ఉత్పత్తులన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఇన్ఫెస్టేషన్ లేదని స్పష్టం చేసింది. ఉత్పత్తులపై నిర్వహించిన టెస్టుల నివేదికలతో, సరైన ఆధారాలతో అధికారులకు పూర్తి సమాచారం సమర్పించినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

Next Story