- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా దొరకని చిన్నారి ఆచూకీ.. ఇంతలో అనూహ్యంగా కుక్క మృతి
చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. పెంపుడు కుక్కే కీలక ఆధారంగా భావించిన పోలీసులకు షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాప మిస్సై ఏడురోజులైనా ఇప్పటి వరకూ ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క మూడురోజుల తర్వాత తిరిగి రాగా.. ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. మరోసారి అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా.. అందుకు కుక్క నిరాకరించడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బోనులో ఉన్న కుక్క కనీసం నీళ్లు కూడా తాగలేక, తిండి తినలేక, నిలబడలేక విలవిలలాడింది. నిన్న.. పాప తల్లి కుక్కతో మాట్లాడుతూ.. జానును తీసుకువస్తావా అని అడుగుతున్న వీడియోలు నెటిజన్లను కదిలించాయి. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద రీతిలో మరణించింది. దీంతో పోలీసులు పాప మిస్సింగ్, కుక్క మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కుక్కపై ఎవరైనా దాడి చేశారా? కుక్క ఆరోగ్యం ఎందుకు క్షీణించింది? అని రెండ్రోజులపాటు విచిత్రంగా ప్రవర్తించిన కుక్క మరణించడంతో.. చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. కుక్క ఆకస్మికంగా మరణించడానికి కారణాలేమై ఉంటాయి? జాహ్నవిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక జంతులేవైనా పాపను లాక్కెళ్లాయా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






