- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR జరిగిన ప్రాంతాల్లో బీజేపీకి పడని ఓట్లను తొలంగించారు: కేటీఆర్
SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జరిగిన ప్రాంతాల్లో బీజేపీకి పడవన్న ఓట్లు అన్ని తొలగించారని వార్తలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 27 లక్షల మంది తమకు ఓటు హక్కు ఉంది కానీ, తమను తొలగించారని కోర్టులో కేసు వేశారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జరిగిన ప్రాంతాల్లో బీజేపీకి పడవన్న ఓట్లు అన్ని తొలగించారని వార్తలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 27 లక్షల మంది తమకు ఓటు హక్కు ఉంది కానీ, తమను తొలగించారని కోర్టులో కేసు వేశారన్నారు. SIR తెచ్చి వెస్ట్ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారని ఆరోపించారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గెలుస్తారని అంతా అనుకున్నారని కానీ ఓడిపోయారని అన్నారు. ఓట్లు తొలగించారని కోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహించారని మమతా బెనర్జీ దిగిపోయారని అన్నారు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారన్నారు.
అందుకే ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడని చెప్పారు. తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకువస్తున్నారని మనం జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కాంగ్రెస్ లో పదవులు అమ్ముకుంటున్నారని షబ్బీర్ అలీ చెప్పారని, అది వాస్తవం అని అన్నారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ పదవిని అమ్ముకున్నారని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టే రాహుల్ గాంధీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూల్చివేతలను మీనాక్షి నటరాజన్ అడ్డుకుందనే కారణంతోనే ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేలా కేసు వివరాలు లీక్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.






