- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ కాంబో ఫిక్స్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

దిశ. సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విజయ్ ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘మ్యాడాక్ ఫిలిమ్స్’ కార్యాలయంలో డైరెక్టర్ విక్రమ్‌తో కనిపించడంతో నెట్టింట ఈ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే డైరెక్టర్ విక్రమ్, విజయ్‌కు ఓ భారీ స్థాయి కాన్సెప్ట్ వినిపించగా.. ఈ కథలోని ఎమోషనల్ డెప్త్ అండ్ కమర్షియల్ అంశాలు మన హీరోకు నచ్చడంతో ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ కాంబోపై మరో అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, మ్యాడాక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రజెంట్ సమాచారం. అంతే కాకుండా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. కాగా.. మనం, 24 వంటి విభిన్న చిత్రాలతో పాటు దూత వెబ్ సిరీస్‌తో మెప్పించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో విజయ్ దేవరకొండ సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్తలు రావడంతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






