- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ నంబర్‌తో మెసేజ్‌లు వస్తే దయచేసి నమ్మొద్దు.. అప్రమత్తంగా ఉండాలంటూ మీనాక్షి చౌదరి హెచ్చరిక
నా పేరుతో ఫేక్ నంబర్ ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి నా అభిమానులు, నెటిజన్లు ఎవరూ వారిని నమ్మి మోసపోవద్దు.

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీల పేర్లను వాడుకుని అమాయక ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరో, హీరోయిన్ల ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కొందరు తాజాగా, ఈ సైబర్ నేరగాళ్ల బారిన టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి పడింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ నంబర్‌ను క్రియేట్ చేసి, కొందరికి మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది.
ఈ మోసం గురించి తెలుసుకున్న మీనాక్షి చౌదరి వెంటనే అప్రమత్తమై తన అభిమానులను అలర్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. "నా పేరుతో ఫేక్ నంబర్ ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి నా అభిమానులు, నెటిజన్లు ఎవరూ వారిని నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా 7604891175 అనే నంబర్ నుండి మీకు ఎలాంటి మెసేజ్‌లు లేదా కాల్స్ వచ్చినా వెంటనే స్పందించకండి. ఆ నంబర్ నాది కాదు. ఒకవేళ ఆ నంబర్ నుండి మీకు మెసేజ్ వస్తే దయచేసి నాకు తెలియజేయండి. ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు" అని రాసుకొచ్చింది. మీనాక్షి స్వయంగా స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మీనాక్షి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






