- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిగ్ ఎకానమీలో సరికొత్త ట్రెండ్.. హెడ్ మౌంటెడ్ కెమెరాలతో గంటకు రూ.250 సంపాదిస్తున్న మహిళ
హ్యూమనాయిడ్ రోబోల శిక్షణ కోసం రోజువారీ ఇంటి పనులను రికార్డ్ చేస్తూ గంటకు రూ.250 సంపాదిస్తున్న చెన్నై గృహిణి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు మరింత అడ్వాన్స్ గా మారుతోంది. తయారీ రంగంలో సమూల మార్పుల దిశగా ఈ ఏఐ ప్రయాణం కొనసాగుతోంది. ఏఐ రంగంలో వస్తున్న మార్పులతో త్వరలోనే పూర్తి స్థాయి ఆటోమెషన్‍కు దారి తీయబోతోందనే చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఓ వీడియో అందరిని మరోసారి షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలలో కార్మికుల తలలకు అమర్చిన హెడ్ మౌండెట్ కెమెరాలు తాజాగా గృహిణిల తలపైకి కూడా వచ్చి చేరాయి. సదరు మహిళలు రోజువారి చేసుకునే పనులను హెడ్ మౌండెట్ కెమెరాల ద్వారా రికార్డు చేస్తున్నారు. ఇలా చెన్నైకి చెందిన ఓ 25 ఏళ్ల గృహిణి కేవలం తన రోజువారీ ఇంటి పనులు చేయడం ద్వారా గంటకు రూ.250 సంపాదిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సషళ్ మీడియాలో వైరల్‍గా మారింది.
ఏఐకి ట్రైనింగ్ కోసం:
సదరు మహిళ తన తలపై ఫోన్‌ను అమర్చుకుని.. కాఫీ పెట్టడం, పండ్లు కోయడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను రికార్డ్ చేస్తోంది. నిజ జీవిత పనులను నిర్వహించడానికి హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చే ఏఐ (AI) కంపెనీలకు ఈ ఫస్ట్-పర్సన్ (తమ కోణం నుంచి కనిపించే) వీడియోలను పంపుతారు. ఆమె రోజుకు 90 కి పైగా ఇలాంటి క్లిప్‌లను చిత్రీకరిస్తుంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీలో ఆమె కూడా ఒక భాగం అని. భవిష్యత్తు రోబోలకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడ వేలాది మంది తమ రోజువారీ జీవితాన్ని ఇలాగే ఫిల్మ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తుండగా ఇంటి పనులు చేసినందుకు గంటకు రూ.250 ఎవరు ఇస్తారంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఏఐ రాకతో సాఫ్ట్ వేర్ రంగాలో భారీగా లే ఆఫ్ లు కొనసాగుతున్న తరుణంలో నిజ జీవితంలో మనుషులు చేసే పనులను రోబోల చేత చేయించేందుకు వాటికి శిక్షణ ఇప్పించడం ఆసక్తిని రేపుతోంది.






