మరో కుటుంబంలో విషాదం.. 10కి చేరిన స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులు

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం(Visaka Steel Plant) ఇంకా మర్చిపోవకముందే మరో విషాదం(Another Tragedy) వెలుగులోకి వచ్చింది. ఉక్కు ద్రవం పడటంతో కార్మికుడు(Worker) సూరిబాబు తీవ్రంగా గాయపడ్డారు..

మరో కుటుంబంలో విషాదం.. 10కి చేరిన స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం(Visaka Steel Plant) ఇంకా మర్చిపోవకముందే మరో విషాదం(Another Tragedy) వెలుగులోకి వచ్చింది. ఉక్కు ద్రవం పడటంతో కార్మికుడు(Worker) సూరిబాబు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ సూరిబాబు తాజాగా మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ధృవీకిరించారు. దీంతో సూరిబాబు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలంలో 9 మంది మృతి చెందారు. సూరిబాబు గాయపడి చికిత్సం పొందుతుండటంలో ప్రమాదం నుంచి బయటపడ్డారులే అనుకున్నారు. కానీ సూరిబాబును మృతువు వీడలేదు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ సూరిబాబు శనివారం ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో సూరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

సూరిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నపం

కాగా ఇప్పటికే చనిపోయిన 9 మంది మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పరిహారం ప్రకటించాయి. వారి కుటుంబ సభ్యుల్లో ఉద్యోగ కల్పనపై హామీ ఇచ్చాయి. దీంతో తాజాగా చనిపోయిన సూరిబాబు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story