హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ బరితెగింపు.. రాంగ్ రూట్‌లో వచ్చి హల్ చల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-13 06:05:58  IST  )

హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ బరితెగించాడు. రాంగ్ రూట్‌లో వస్తూ ఎదురుగా ఉన్న బైక్, కారు డ్రైవర్లను భయబ్రాంతులకు గురి చేశాడు. బస్సును సరైన రూట్‌లో తిప్పాలని చెప్పడంతో వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ బరితెగింపు.. రాంగ్ రూట్‌లో వచ్చి హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ బరితెగించాడు. రాంగ్ రూట్‌లో వస్తూ ఎదురుగా ఉన్న బైక్, కారు డ్రైవర్లను భయబ్రాంతులకు గురి చేశాడు. బస్సును సరైన రూట్‌లో తిప్పాలని చెప్పడంతో వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించినప్పటికీ వినకుండా రాంగ్ రూట్‌లోనే వెళ్లేందుకు ప్రయత్నించాడు. బైకర్ ధైర్యంతో తన బండిని తీసుకువెళ్లి బస్సుకు అడ్డంగా పెట్టి సరైన దారిలో వెళ్లాలని చెప్పాడు. ఈ క్రమంలో బస్ డ్రైవర్ ప్రయాణికులతో ఉన్న ఓ ఆటోను కూడా ఢీ కొట్టి కొట్టాడు.

ఈ సీన్ మొత్తం కారులో కూర్చుకున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ఫేర్ చేశాడు. పోలీసులు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బస్సు 195W రూట్‌కు చెందినది కాగా నంబర్ ఆధారంగా 8సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే బస్సుపై రూ3480 జరిమానా ఉందని గుర్తించారు. వీడియో వైరల్ అవ్వడంతో బస్ డ్రైవర్ తీరుపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. బాధితుడి నుంచి భారీగా డబ్బు స్వాహా

ప్రాణాలను పణంగా పెట్టి ‘వర్క్ ఫ్రమ్ బైక్’ వద్దు: సీపీ సజ్జనార్

Next Story