- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓజీ 2’ అప్‌డేట్.. అప్పటినుండి స్టార్ట్ కానున్న షూటింగ్?
‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ చిత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ స్టైలిష్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓజీ 2’ రానుందనే వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సీక్వెల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, డి.వి.వి. దానయ్య నిర్మించారు. ముఖ్యంగా తమన్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.






