జాతీయ రహదారిపై ప్రమాదం.. టైరు పేలి బోల్తాపడ్డ కారు

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

జాతీయ రహదారిపై ప్రమాదం.. టైరు పేలి బోల్తాపడ్డ కారు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కారు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు కోదాడ మండలం చిమిర్యాల క్రాస్‌రోడ్‌ సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న సమయంలో కారు ముందువైపు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి రహదారిపై పల్టీలు కొడుతూ బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి, గాయపడిన నలుగురిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మరికొందరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. జాతీయ రహదారిపై వాహనం బోల్తాపడటంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story