- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికే ఆదర్శంగా నిలుస్తా: మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో: రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాలవల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ఎప్పుడు వరిపైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు. పంట మార్పిడిపై తప్పనిసరి దృష్టి సారించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఉద్యాన పంటలను సాగు చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుదన్నారు. అయితే బత్తాయికి పేరు ప్రఖ్యాతులుగాంచిన నల్గొండ జిల్లాలో తిరిగి బత్తాయిని ఎక్కువ మొత్తంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని, బత్తాయి ఆరోగ్యపరంగా కూడా మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు పంట మార్పిడితోపాటు, ఉద్యాన పంటలను సాగు చేయాలని, నల్గొండ జిల్లాలో బత్తాయి సాగుకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు ,తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు..
కార్యక్రమానికి హాజరైన పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని, ముందు నుండి నల్గొండ బత్తాయికి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రుణాలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నదన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డి. రాజి రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి, చెవిటి వెంకన్న, పావని రెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, అభ్యుదయ రైతులు, బత్తాయి రైతులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను మంత్రి ప్రారంభించారు.






