- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి వల్లే నష్టం.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: సోము వీర్రాజు హెచ్చరిక
ఫీడ్ ధరలపై పెంపుపై ఆక్వా రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫీడ్, సీడ్ రంగంపై బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఫీడ్ ధరల(Feed Prices)పై పెంపుపై ఆక్వా రైతులు(Aqua farmers) పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫీడ్, సీడ్ రంగంపై బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు(BJP MLA Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కూడా కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయన్నారు. ఫీడ్ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచాయని మండిపడ్డారు. లాబీలతో రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్, సీడ్ ధరల అంశంపై కూటమి ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు చర్యలు తీసుకుంటామని సైతం చెప్పారు. రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఆక్వా రైతుల సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్తానని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆక్వా రైతులకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హామీ ఇచ్చారు.
కాగా ఆక్వా రైతుల ఉద్యమం ఉధృతమవుతోన్న వేళ సోము వీర్రాజు చేసిన కామెంట్స్ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. తమకు మద్దతు తెలిపిన సోము వీర్రాజుకు కృతజ్ఞతలు అంటూ ఆక్వా రైతులు తెలిపారు. అయితే ఫీడ్ ధరలు తగ్గించకపోతే మాత్రం కచ్చితంగా నిరసన వ్యక్తం చేశామని స్పష్టం చేశారు. ఆందోళనలకు మరోవారం సమయం ఉంది కాబట్టి ఇంతలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులు సంతోషపడే ప్రకటనలు వస్తాయేమో చూడాలి.






