- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిండ ముంచిన అకాల వర్షం.. భారీ సంఖ్యలో నేలకొరిగిన నిమ్మ చెట్లు
by Kodari Anjali |
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నిమ్మ చెట్లు నేలకొరిగాయి.

X
దిశ, శాలిగౌరారం: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. రాత్రంతా గాలివానతో వర్షం విజృంభించడంతో మండల పరిధిలోని పెర్క కొండారం, బచ్చువారి గూడెంకు చెందిన 65 మంది రైతుల నిమ్మ తోటల్లో దాదాపు 1000 నిమ్మ చెట్లు నేలకొరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు వేముల ఆంజనేయులు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని ఏళ్లుగా నిమ్మ తోటలనే నమ్ముకుని జీవిస్తున్న రైతులు భారీగా నష్టపోయారని అన్నారు. దాదాపు పెర్కకొండారం (బచ్చు వారి గూడెం)కు చెందిన 65 మందికి చెందిన రైతులకు చెందిన దాదాపు 1000 నిమ్మ చెట్లు నేలకొరిగాయని, దాదాపు 50 లక్షల పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులందరికీ తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేముల ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






