విద్యుత్ శాఖ వర్సెస్ అటవీ శాఖ.. చిన్న విషంతో మొదలై కొట్టుకున్న అధికారులు!

by Prasad Jukanti |   (  Updated:2026-06-13 13:21:12  IST  )

విద్యుత్, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ.. నడిరోడ్డుపై బాహాబాహీకి దిగివరకు చేరుకుంది.

విద్యుత్ శాఖ వర్సెస్ అటవీ శాఖ.. చిన్న విషంతో మొదలై కొట్టుకున్న అధికారులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంలో శాఖల మధ్య సరైన సమన్వయం ఉంటేనే ప్రజలకు సరైన రీతిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయి. అలా కాకుండా డిపార్ట్మెంట్ల మధ్య వైరం ఉంటే ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా అలాంటి సమస్య అలాగే ఉంటుంది తప్ప పరిష్కారం లభించదు. తాజాగా విద్యుత్ శాఖ వర్సెస్ అటవీ శాఖ ముదిరిన వివాదం హాట్ టాపిక్‍గా మారింది. చెట్ల కొమ్మలను తొలగించే విషయంలో చిన్నగా మొదలైని గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు ఇరు శాఖల అధికారులు బాహాబాహీకి వెళ్ళేంత వరకు పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొట్టుకున్న అధికారులు:

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో విరిగిపడిన చెట్ల కొమ్మల విషయంలో విద్యుత్ శాఖ (Transco), అటవీ శాఖ (Forest Department) అధికారుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇది ఫారెస్ట్ ఏరియా అని అటవీ శాఖ అధికారులు వాదించగా కరెంట్ వైర్లు ఎలా వేయాలంటూ విద్యుత్ శాఖ అధికారుల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో మాట మాట పెరిగి చివరకు సహనం కోల్పోయిన అధికారులు చివరకు ముష్టి యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల తీరు ఇలా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిా

Next Story