ప్రభుత్వ బడి కోసం పూర్వవిద్యార్థుల ఐక్యత

by Batti.Sumithra |

ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ వైభవం కోసం 50 వసంతాల పేరుతో పూర్వ విద్యార్థులంతా ఏకమయ్యారు.

ప్రభుత్వ బడి కోసం పూర్వవిద్యార్థుల ఐక్యత
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ వైభవం కోసం 50 వసంతాల పేరుతో పూర్వ విద్యార్థులంతా ఏకమయ్యారు. మౌలిక వసతుల కల్పన కోసం, ఉన్నతమైన విద్య కోసం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పెంపుదలకు సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 1976 నుండి 2026 వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించి, నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఏకమై శనివారం ఒక చోటుకు చేరారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సహకారంతో గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల నిర్మించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు ఉన్నాయని, అనుభవమైన ఉపాధ్యాయ బృందం కలదని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని ఎంఈఓ పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు చందులాల్, నాయకులు రామచంద్రయ్య, ప్రమోద్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story