తిరుమలాయపాలెం సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం..

by Kodari Anjali |

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది.

తిరుమలాయపాలెం సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం..
X

దిశ, తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. తిరుమలాయపాలెం మండల కేంద్రంకు చెందిన తూమాటి కాంతయ్య అనే వృద్ధుడు ఈనెల 6తేదీన కడుపునొప్పి వస్తుందని, కుటుంబ సభ్యులు తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వృద్ధుడికి యూరియాను బ్యాగ్ వేయాలిసి రాగ, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ కాకుండా సిబ్బంది, సెక్యూరిటీతో వైద్యం చేయించడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించామని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఖమ్మంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై బాధితులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

Next Story