- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా వీధుల్లో అడుక్కుంటున్న రోబో.. ఉద్యోగాలు లాక్కున్న పాపం ఊరికే పోతుందా..! నెటిజన్ల సెటైర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యుమనాయిడ్ రోబోలు మనుషుల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యుమనాయిడ్ రోబోలు మనుషుల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైనాలో ఓ హ్యూమనాయిడ్ రోబో నడివీధిలో ఏకంగా భిక్షాటన చేస్తూ నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది.
క్యూఆర్ కోడ్ తో హైటెక్ భిక్షాటన
వీడియోలో ఓ రోబో.. రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చొని దారిన పోయే వారిని చేతులతో సైగ చేస్తూ యాచిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నగదు ఇచ్చే వారి కోసం ముందు ఒక ప్లేట్, ఓ నల్లటి బ్యాగ్‌ను పెట్టుకున్న ఈ హైటెక్ రోబో.. ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వారి కోసం ఏకంగా ఒక క్యూఆర్ కోడ్ (QR Code)ను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
నెటిజన్ల సెటైర్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మనుషుల ఉద్యోగాలు ఊడగొట్టిన పాపం ఊరికే పోతుందా.. చివరకు రోబోలకే అడుక్కునే ఖర్మ పట్టింది’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘బాబ్బాబు.. చార్జింగ్ కు డబ్బులు లేవయ్యా.. ఓ పది రూపాయలు ధర్మం చేసి పుణ్యం కట్టుకోండయ్యా..’ అని ఆ రోబో అడుగుతున్నట్లుగా ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఏ పనికైనా రోబోలు వచ్చేస్తున్నాయని, కనీసం ఈ భిక్షాటన వృత్తినైనా మనుషులకు వదిలేయండి అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
కారణం ఏంటంటే..?
ఈ వీడియో వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇది ఏదైనా ఆర్ట్ ప్రాజెక్ట్ కావచ్చని, మార్కెటింగ్ ప్రచారం, లేదా ప్రజల స్పందన తెలుసుకునేందుకు చేసిన సామాజిక ప్రయోగం (Social Experiment) అయి ఉండొచ్చని నెటిజన్‌లు భావిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం రోబోటిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫ్యాక్టరీలు, లాజిస్టిక్స్, పబ్లిక్ సర్వీసెస్ లో వీటి వాడకం పెరిగిన విషయం తెలిసిందే.






