అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే కోవలక్ష్మి

by Batti.Sumithra |

ఖరీఫ్ సాగు సీజన్ నేపథ్యంలో పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఎమ్మెల్యే కోవలక్ష్మి అటవీ శాఖ అధికారులను కోరారు.

అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే కోవలక్ష్మి
X

దిశ, ఆసిఫాబాద్ : ఖరీఫ్ సాగు సీజన్ నేపథ్యంలో పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఎమ్మెల్యే కోవలక్ష్మి అటవీ శాఖ అధికారులను కోరారు. శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల హక్కులకు భంగం కలిగించవద్దని ఆమె అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విత్తనాలు విత్తుకునేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. సాగు పనుల సమయంలో రైతుల పనులకు ఆటంకం కల్పించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా (జాయింట్) సర్వే నిర్వహించి అటవీ భూముల హద్దులను పూర్తిస్థాయిలో నిర్ధారించాలని, పోడు భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Next Story