ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మల్లు భట్టి విక్రమార్క

by Batti.Sumithra |

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, మంచిర్యాల : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూలు తెగలు గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం.వంశి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం దిశగా పనిచేస్తుందని అన్నారు.

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి రూ.2 వేల 216 కోట్లు అభివృద్ధికి కేటాయించిందన్నారు. సరస్వతి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలలో పుష్కర ఘాట్ల నిర్మాణం, వసతుల కల్పనకు రూ.1000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బాసర నుండి భద్రాచలం వరకు రూ.802 కోట్ల వ్యయంతో ఆధ్యాత్మిక కారిడార్ నిర్మాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు రూ.70 కోట్ల నిధులతో గూడెం దేవాలయ అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని, పిప్రివేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి గూడెం ఆలయ అభివృద్ధికి 37 రోజుల్లో నిధులు సమకూర్చి అభివృద్ధికి పట్టం కట్టినట్లు తెలిపారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట..

వ్యవసాయం ఆధారంగా దేశానికి వెన్నెముకల ఉండే రైతన్నలకు వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఈ ప్రాంత వ్యవసాయ రైతంగానికి గూడెం గుట్ట పరిధిలో రూ.74 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. విద్యవైద్యం రంగాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విద్య వైద్యం వ్యవసాయ ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధిలో నియోజకవర్గ శాసనసభ్యుల కృషి అభినందనీయమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలలో భక్తులకు వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు.

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.9.40 కోట్ల వ్యయంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలో రూ.2.30 కోట్ల తో నగర అభివృద్ధి సీసీ రోడ్ల పనులు, రూ.2 కోట్లతో మురుగునీటి కాలువల నిర్మాణ పనులు, దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం పరిధిలో రూ.58 కోట్ల అంచనా తో ఆలయ పున నిర్మాణం, గుడి రేవు, మాదెల, ద్వారక సమీపంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడమవైపున రూ.74.40 కోట్లతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దండే. విటల్, భూపాలపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు గండ్ర. సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్, మంచిర్యాల, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ధరణి. మధుకర్, మహంకాళి స్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story