- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోల్‌మామడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
రోల్‌మామడ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

దిశ, నేరడిగొండ : మండలంలోని రోల్‌మామడ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక్కి తీసే క్రమంలో, వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డ్రైవర్ గమనించలేదు. దీంతో ద్విచక్ర వాహనం లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండడి భీమ్‌రావు (30), యాపలగూడ గ్రామానికి చెందిన యువకుడు, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి ఆకస్మిక మృతితో యాపలగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.






