- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత క్రీడాల్లో రాణించాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
యువత క్రీడాల్లో రాణించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

దిశ, మిర్యాలగూడ టౌన్: యువత క్రీడాల్లో రాణించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలో ఎన్ ఎస్ పి గ్రౌండ్‌లో బిఎల్ఆర్, ఎన్ వి ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూకల చారిటబుల్ ట్రస్ట్ జిపిఎల్ సిజన్ 02 క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు శనివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ స్థాయిలో యువత ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూకల వేణుగొపాల్ రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్, శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






