ప్రజా పాలనలో ఆరోగ్య ప్రగతి.. 99 రోజుల ప్రణాళిక సక్సెస్ శాఖ

by Naga Rani Yarlagadda |

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజా పాలనలో ఆరోగ్య ప్రగతి.. 99 రోజుల ప్రణాళిక సక్సెస్ శాఖ
X
  • పనితీరుపై మంత్రి దామోదర్ హర్షం
  • రెండేళ్లలో 15 వేల ఉద్యోగాల భర్తీ.. మెడికల్ హబ్‌గా మహబూబ్‌నగర్ అభివృద్ధి

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో ఆరోగ్యశాఖ కీలక పాత్ర పోషించిందని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా శాఖ పనితీరును ప్రశంసించిందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం వైద్య సేవలను విస్తరిస్తోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ కృషి కొనసాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ సాధించిన ప్రధాన మైలురాళ్లు ఇవే

* హెల్త్ అవేర్‌నెస్ వీక్: ఏప్రిల్ 6–11 వరకు 20కి పైగా కార్యక్రమాలతో ప్రజారోగ్యం, మాతా-శిశు సంరక్షణ, వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కల్పించారు.

* ఫుడ్ సేఫ్టీ: నెక్లెస్ రోడ్డులో వాకథాన్, నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఈట్ రైట్, మిల్లెట్ మేళాలు నిర్వహించి సురక్షిత ఆహార అలవాట్లపై చైతన్యం తెచ్చారు.

* క్యాన్సర్ సంరక్షణ, ఏఐ: నిమ్స్‌లో రూ.33 కోట్లతో లినాక్ సేవలు ప్రారంభించారు. క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా మార్చి స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ తెచ్చారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి 20 ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించారు.

* ట్రామా కేర్ పాలసీ: ప్రమాద బాధితుల కోసం 109 ట్రామా సెంటర్లు, 31 క్రిటికల్ కేర్ బ్లాక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నాగర్‌కర్నూల్‌లో కొత్త బ్లాక్ ప్రారంభించగా, కొండాపూర్‌లో శంకుస్థాపన చేశారు.

* డిజిటల్ సంస్కరణలు: పారదర్శకత కోసం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్‌తో పాటు పీసీపీఎన్‌డీటీ, ఏఆర్టీ, సరోగసి పోర్టల్స్‌ను పూర్తిగా డిజిటలైజ్ చేశారు.

* మాతా-శిశు ఆరోగ్యం: సేఫ్ మదర్‌హుడ్ డే ద్వారా గర్భిణుల సంరక్షణ, నార్మల్ డెలివరీల ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టారు. నర్సింగ్ కాలేజీల్లో మిడ్‌వైఫరీ కేంద్రాలను విస్తరిస్తున్నారు.

* మానసిక ఆరోగ్యం, డీ-అడిక్షన్: ఎర్రగడ్డలో డీ-అడిక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు, 35 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో కౌన్సెలింగ్ సెంటర్లు, స్పెషల్ ఇంటాక్సికేషన్ కేర్ యూనిట్లను తెచ్చారు.

* ప్రత్యేక వైద్య శిబిరాలు: కేబుల్ బ్రిడ్జిపై హెచ్‌ఐవీ అవగాహన మానవహారం నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక క్యాంపులు, ఖైదీల కోసం జైళ్లలో ప్రతి 3 నెలలకొకసారి స్పెషలిస్ట్ వైద్య శిబిరాల విధానాన్ని తెచ్చారు.

* డ్రగ్ కంట్రోల్, ఆయుష్: యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా డ్రగ్ కంట్రోల్ డే నిర్వహించి నకిలీ మందులపై కఠిన చర్యలు చేపట్టారు. యోగా, ఆయుష్ సేవలను విస్తృతంగా ప్రచారం చేశారు.

* భారీగా నియామకాలు: ఇటీవల 866 మంది వైద్యులు, 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ పూర్తి చేశారు. దీంతో గత రెండున్నరేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 15 వేలకు చేరింది.

* వైద్యుల సంక్షేమం, మెడికల్ హబ్: కోఠిలో డాక్టర్స్ భవనాన్ని పునరుద్ధరించారు. మహబూబ్‌నగర్‌ను దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నారు.

Next Story