వ్యర్థ జలాల ట్యాంకర్ ని పట్టుకున్న యువకులు

by Batti.Sumithra |

అక్రమంగా పరిశ్రమల నుండి కాలుష్య జలాలను తీసుకొచ్చి పారబోస్తున్న ట్యాంకర్ ని పట్టుకున్న ఘటన గడ్డపోతారం మున్సిపాలిటీ ఖాజీపల్లి శివారులో చోటుచేసుకుంది.

వ్యర్థ జలాల ట్యాంకర్ ని పట్టుకున్న యువకులు
X

దిశ, జిన్నారం : అక్రమంగా పరిశ్రమల నుండి కాలుష్య జలాలను తీసుకొచ్చి పారబోస్తున్న ట్యాంకర్ ని పట్టుకున్న ఘటన గడ్డపోతారం మున్సిపాలిటీ ఖాజీపల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం పట్టపగలు కిష్టయ్య పల్లికి చెందిన ఒక ట్యాంకర్ ఎస్ఎంఎస్ పరిశ్రమ నుండి కాలుష్య వ్యర్థ జలాలను తీసుకొని ఖాజీపల్లి గ్రామానికి చెందిన సంగు జీతయ్య వ్యవసాయ పొలంలో వ్యర్థాలను వదులుతున్నారు. ఇది గమనించిన స్థానిక యువకులు ట్యాంకర్ ని పట్టుకున్నారు. డ్రైవర్ ను నిలదీశారు. వెంటనే విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ యువకులకు సర్దిచెప్పి ట్యాంకర్ ని అక్కడినుండి పంపినట్టు సమాచారం. విషయం పీసీబీ అధికారులకు చెప్పగా ఘటన స్థలానికి వచ్చి పారబోసిన వ్యర్థాల శాంపిల్ ని సేకరించారు. ఏ పరిశ్రమ నుండి తీసుకువచ్చారు గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Next Story