- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు, వాతావరణ శాఖ సూచనలను గమనించండి: సీపీ సజ్జనార్
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.

దిశ, సిటీక్రైం: భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని కోరారు. వాతావరణ, పోలీసు శాఖలు ఇచ్చే సూచనలను గమనించి అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలన్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో తెరిచిన, మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నేపధ్యంలో పోలీసు కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయేల్ డేవిస్, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి శనివారం మాసబ్ ట్యాంక్, పంజాగుట్ఠ శ్మశాన వాటిక, కేబీఆర్ పార్క్, తదితర వాటర్ లాగిన్ పాయింట్‌లను ఆయన సందర్శించారు. వర్షపు నీరు రోడ్లపై చాలా సేపు నిల్వగుండా సిబ్బంది చర్యలను చేపట్టాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎమ్ సీ, విద్యుత్ శాఖ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వర్షాల వల్ల అత్యవసర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు.






