విప్‌లు రేవంత్‌కు చీర్ బాయ్స్‌.. బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-06-13 16:01:27  IST  )

ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్ గర్ల్స్ ఉన్నట్టు ప్రభుత్వ విప్‌లు సైతం రేవంత్‌రెడ్డికి చీర్ బాయ్స్‌లాగా మారారని బీఆర్ఎస్ఎల్‌పీ విప్ కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.

విప్‌లు రేవంత్‌కు చీర్ బాయ్స్‌.. బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎల్ మ్యాచ్‌లో చీర్ గర్ల్స్ ఉన్నట్టు ప్రభుత్వ విప్‌లు సైతం రేవంత్‌రెడ్డికి చీర్ బాయ్స్‌లాగా మారారని బీఆర్ఎస్ఎల్‌పీ విప్ కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ప్రతిరోజూ తిట్టడమే విప్‌ల పనిలా మారిందన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఆది శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఫైర్ అయ్యారు. విప్ పదవి విధి విధానాలు ఏమిటో ఆది శ్రీనివాస్ తెలుసుకోవాలని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఉన్న ప్రజాగ్రహాన్ని చూసి మాట్లాడాలని.. ఆది శ్రీనివాస్ మూడు సార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి నోటికెంతొస్తే అంత అన్నట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ సైతం దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్ భవిష్యత్ గురించి ఆయనకు దిగులు అవసరం లేదని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్‌కు దక్కేది మూడో స్థానమేనని చెప్పారు. కేసీఆర్ మీద మాట్లాడే స్థాయి రేవంత్‌కే లేదని.. ఆది శ్రీనివాస్‌కు ఇక అసలే లేదని అన్నారు. అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బీఆర్ఎస్ నేతలపై అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇకపై పిచ్చి విమర్శలు మాని ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి పెడితే మంచిదని సూచించారు.

Next Story