- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభలో బలం పెంచుకోవడానికి బీజేపీ కుట్రలు : ఎంపీ మల్లు రవి ఆరోపణలు
రాజ్యసభలో తమ బలం పెంచుకోవడానికి బీజేపీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కైందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి ఆరోపించారు.

దిశ, ఆమనగల్లు : రాజ్యసభలో తమ బలం పెంచుకోవడానికి బీజేపీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కైందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి ఆరోపించారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుచూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, లేక నియంతృత్వ పాలన కొనసాగుతోందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం నోటీసు మాత్రమే జారీ అయిందని స్పష్టం చేశారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ నాయకుల పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో విభేదాలు సహజమేనని, అయితే వాటిని సాకుగా చేసుకుని కుట్రలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు రాజ్యసభ సీటును కూడా చోరీ చేసిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లుగానే, తెలంగాణలో కూడా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించి అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నాయకులు రాములు, మల్లయ్య, శ్రీకాంత్, శ్రీరాములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






