ఆలయంలో మందుబాబుల హల్ చల్.. ద్వారాలు మూసి హంగామా

by Vemula.Srinu Prasad |

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మందు బాబులు హల్ చల్ చేశారు. ఏకంగా ఆలయంలోకి వచ్చి ప్రధాన ద్వారాలను మూసివేస్తూ నానా హంగామా సృష్టించారు. ..

ఆలయంలో మందుబాబుల హల్ చల్.. ద్వారాలు మూసి హంగామా
X

దిశ, అమలాపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మందు బాబులు హల్ చల్ చేశారు. ఏకంగా ఆలయంలోకి వచ్చి ప్రధాన ద్వారాలను మూసివేస్తూ నానా హంగామా సృష్టించారు. మందుబాబుల వికృత చేష్టలకు భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలపిన వివరాల ప్రకారం ఆలయంలో భక్తులు చెల్లించిన కొబ్బరి చెక్కలను తీసుకెళ్ళేందుకు ఆలయ పాటదారు చెందిన వ్యక్తి ట్రక్కు ఆటోను ఆలయం వెలుపల గల రహదారి మీద పార్క్ చేసి కొబ్బరి చెక్కలను ఆలయం నుండి తెచ్చుకొని ఆటోలోకి ఎగుమతి చేసుకొంటున్నాడు.

ఇంతలో ఇద్దరు మందు బాబులు అక్కడికి వచ్చి రహదారికి అడ్డంగా ఆటో ఎవరు పెట్టమన్నారని, ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని కేకలు వేస్తూ.. అతనిని దర్భాషలాడుతూ ఆటో గల వ్యక్తిపై దౌర్జన్యానికి దిగుతూ భౌతిక దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆలయంలోకి వెళ్ళి ఉద్యోగులను నానా దుర్భాషలాడుతూ సెక్యూరిటీ గార్డును బయటకు నెట్టి ప్రధాన ద్వారాలను మూసివేసి భయభ్రాంతులకు గురిచేశారు.

దీనితో ఒక్కసారిగా ఏమి జరుగుతుందో తెలియక ఆలయం లోపల ఉన్న భక్తులు అయోమయ పరిస్థితిలోకి వెళ్ళారు. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఆలయంలో ఇలాంటి సంఘటన జరిగినా కొంతమంది నాయకులు దీనిని రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

Next Story