పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Batti.Sumithra |

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, లక్షెట్టిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడ, మూత్రశాలలు ఇతర పూర్తి సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story