కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పని చేస్తుంది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Kodari Anjali |

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పని చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జుక్కల్ నియోజకవర్గం బీఎల్ ఏ ఇంచార్జ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పని చేస్తుంది: ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పని చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జుక్కల్ నియోజకవర్గం బీఎల్ ఏ ఇంచార్జ్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ మేరకు శనివారం జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు కోసం ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ శిబిరంలో ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ ఏ లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత..

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి వారి పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధ హక్కు అని, దానిని కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, బీఎల్ఏ కోఆర్డినేటర్ నవీన్, బిచ్కుంద మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ కవిత, చైర్‌పర్సన్ సీమ శెట్టి కర్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, ఏఎంసీ చైర్మన్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story