- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పని.. తాగునీటికి దిక్కులేదు
జాతీయ ఉపాధి హామీ పనుల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం.

దిశ, డోర్నకల్: జాతీయ ఉపాధి హామీ పనుల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో వంద రోజుల ఉపాధి హామీ పనుల్లో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోతున్నారు. మండే ఎండల్లో కనీసం త్రాగునీరు కల్పించకపోవడం గమనార్హం. ఉపాధి హామీ కూలీలు ఇంటి వద్ద నుంచే మంచినీళ్ల బాటిల్లు తీసుకెళుతున్నట్లు చెబుతున్నారు. తాగునీళ్లు లేకపోవడంతో కొన్నిసార్లు చెరువు నీళ్లు తాగవలసి వస్తుందని ఆవేదన చెందారు. నీడ, ప్రాథమిక చికిత్స కిట్టు అందుబాటులో ఉంచడం లేదని తెలిపారు. సర్పంచ్, కార్యదర్శి నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఊరికి దూరంగా సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉపాధి హామీ పనులు చేస్తున్నట్లు మహిళలు వాపోయారు.
రాకపోకలకు ఆరు కిలోమీటర్లు వృద్ధులు నడవలేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆవేదన చెందారు. అలాగే ఆరు రోజుల పని దినాలకు మూడు రోజులకే డబ్బులు చెల్లిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. అదేవిధంగా బోడియా తండా గ్రామంలో జాబ్ కార్డుదారుని సంబంధిత ఓ అధికారి బెదిరించినట్లు ఆరోపించారు. ఆరు పని దినాలు పనిచేస్తే మూడు రోజుల డబ్బులు చెల్లిస్తున్నారని తమ అనుమానాలను మేటు ద్వారా నివృత్తి చేసుకునే క్రమంలో ఆ అధికారిని జాబ్ కార్డులు పీకేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.






