ఏడవాలో... నవ్వాలో అర్ధం కావడంలేదు: ప్రభుత్వ నిర్ణయంపై బొత్స సెటైర్లు

by Vemula.Srinu Prasad |

నవ్వాలో.. ఏడవాలో అర్ధం కావడం లేదని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు...

ఏడవాలో... నవ్వాలో అర్ధం కావడంలేదు: ప్రభుత్వ నిర్ణయంపై బొత్స సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: నవ్వాలో.. ఏడవాలో అర్ధం కావడం లేదని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. టూరిజం డెవలప్ మెంట్‌లో భాగంగా పలు తీర ప్రాంతాల్లో రిసార్టులు, బీచ్‌లో మద్యం అమ్మకాల నిర్ణయంపై ఆయన విమర్శలు కురిపించారు. పర్యాటకం అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా మద్యం అమ్ముతారా అని బొత్స ప్రశ్నించారు. ఏపీ కల్చర్ ఏంటని, బీచ్‌లో బార్లు నడిపిస్తారా అంటూ నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏడవాలో, నవ్వాలో, బాధపడాలో అర్ధం కావడంలేదని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు.

విద్యాశాఖ పని తీరుపైనా బొత్స ఫైర్

అలాగే విద్యాశాఖ పని తీరుపైనా బొత్స మండిపడ్డారు. విద్యాశాఖను చెడగొట్టేందుకే నారా లోకేశ్‌కు ఆ శాఖ అప్పగించారా అని ఆయన ప్రశ్నించారు. లోకేశ్ చేస్తున్న సవాళ్లు విద్యాశాఖను చెడగొట్టేందుకా.. లేక బాగు చేయడానికా అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికే విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, బూట్లు అందజేసేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ఎమ్మెల్సీ బొత్స ఎద్దేవాచేశారు.

Next Story