- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. అధికారులకు నో లీవ్.. కోమటిరెడ్డి కీలక ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులను మంత్రి కోమటిరెడ్డి అప్రమత్తం చేశారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. పై స్థాయి నుండి కింద స్థాయి వరకు ఆర్ అండ్ బి ఇంజనీర్లు అందరు క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. శని,ఆదివారాలు అని సెలవులు ఏమి లేవనీ... అత్యవసరం అయితే తప్పా అందరు ఫీల్డ్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల..వరదలతో ముందుగా ఇబ్బందిగా మారే రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలి, భారీ వర్షాల వల్ల.. వరదలతో ముందుగా ఇబ్బందిగా మారే రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలనీ,ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. రోడ్లు కోతకు గురైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మానిటరింగ్ చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్ బి డివిజన్ల వారిగా వివరాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేయాలన్నారు.






