రెండు క్వింటాల గంజాయి పట్టివేత..

by Kodari Anjali |

అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

రెండు క్వింటాల గంజాయి పట్టివేత..
X

దిశ, కొణిజర్ల: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం వైరా జాతీయ ప్రధాన రహదారిపై పల్లిపాడు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి ట్రైలలో ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు బొలేరో వాహనంలో తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వాహనంతో పాటు మహిళతో పాటు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 200 కేజీల గంజాయి విలువ లక్షల్లోనే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ ముఠా వెనక ఎవ్వరెవరు ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story