తలుపు తెరవగానే బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ..

by Kodari Anjali |

ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

తలుపు తెరవగానే బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ..
X

దిశ, వనస్థలిపురం: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటన శనివారం కలకలం రేపింది. సాయినగర్ కాలనీ రోడ్ నంబర్-2లో నివాసముంటున్న పాశం శ్యామల (65) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి తలుపు తట్టాడు. నిద్రమత్తులో తలుపు తెరిచిన వెంటనే ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. భర్త మృతి చెందడంతో శ్యామల కింద అంతస్తులో ఒంటరిగా నివసిస్తుండగా, ఆమె కుమారుడు పై అంతస్తులో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.

Next Story