- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో రూ. 1,600 కోట్ల బొగ్గు మాయం..! సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
సింగరేణి సంస్థలో జరుగుతున్నా అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థలో జరుగుతున్నా అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందంటూ వస్తున్న మీడియా కథనాలపై తక్షణమే స్పందించాలని, వీటిపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 51,500 కోట్ల బకాయిల కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉందని, ఇలాంటి తరుణంలో ఇటువంటి అక్రమాలు సంస్థను మరింత దెబ్బతీస్తాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్థలో పారదర్శకతను పెంచేందుకు అంతర్గత నియంత్రణ వ్యవస్థలను సమీక్షించాలని, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ సాధనాలను వినియోగించాలని ఆయన సూచించారు. 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాల జీవనోపాధి సింగరేణిపై ఆధారపడి ఉందని, దేశ ఇంధన భద్రతలోనూ ఈ సంస్థ పాత్ర కీలకమని గుర్తుచేశారు. వ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్ది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కార్మికుల సంక్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి తన లేఖలో కోరారు.






