శ్రీశైలం ఆలయ ఆదాయానికి వైసీపీ ఎమ్మెల్యే గండి.. నోటీసులు జారీ చేసిన కమిటీ

by Naga Rani Yarlagadda |

శ్రీశైలం దేవస్థానం ఆదాయానికి దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గండికొడుతున్నట్లు దేవస్థానం గుర్తించింది.

శ్రీశైలం ఆలయ ఆదాయానికి వైసీపీ ఎమ్మెల్యే గండి.. నోటీసులు జారీ చేసిన కమిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం దేవస్థానం ఆదాయానికి దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గండికొడుతున్నట్లు దేవస్థానం గుర్తించింది. మూడేళ్లుగా దేవస్థానానికి సంబంధించిన కాటేజీని అప్పగించకుండా వాడుకుంటున్నట్లు దేవస్థాన కమిటీ కనుగొంది. దీంతో కాటేజీని వెంటనే అప్పగించాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దేవస్థానం ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న తేదీలోగా కాటేజీను అప్పగించాలని, లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటామని మరో నోటీసు జారీ చేసింది. అలాగే శ్రీశైలంలోని మరో 6 కాటేజీ కూడా అప్పగించాలని తుది నోటీసులు ఇచ్చింది. కాటేజీలను వెంటనే అప్పగించకపోతే ఈ నెల 20వ తేదీలోగా వాటిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.

Next Story