నాగార్జునసాగర్‌లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, భర్త పరిస్థితి విషమం

by Kodari Anjali |

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని శ్మశానవాటిక సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.

నాగార్జునసాగర్‌లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, భర్త పరిస్థితి విషమం
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని శ్మశానవాటిక సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు, ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారు, మహీంద్రా థార్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన పాలపర్తి కాత్యాయని (55) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న ఆమె భర్త పాలపర్తి శ్రీనివాసరావు (66) తీవ్ర గాయాలకు గురయ్యారు. ప్రమాదం అనంతరం స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆయనను నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని ప్రభుత్వ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాద తీవ్రత కారణంగా శ్రీనివాసరావు తీవ్ర షాక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై విజయపురి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story