నలుగురు మావోయిస్టులకు బెయిల్ మంజూరు.. షరతులు విధింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-13 15:11:27  IST  )

నలుగురు మావోయిస్టులు పోడియం రెండు అలియాస్ బీమ, మదకం మదన్ అలియాస్ మాదనన్న, సోది మనీలా, సోది మంగిలకు బెయిల్ మంజూరు అయింది. వీరికి కృష్ణా జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది...

నలుగురు మావోయిస్టులకు బెయిల్ మంజూరు.. షరతులు విధింపు
X

దిశ, వెబ్ డెస్క్: నలుగురు మావోయిస్టులు(Maoists) పోడియం రెండు అలియాస్ బీమ, మదకం మదన్ అలియాస్ మాదనన్న, సోది మనీలా, సోది మంగిలకు బెయిల్ మంజూరు(Bail granted) అయింది. వీరికి కృష్ణా జిల్లా కోర్టు(Krishna District Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నిందితుడు రూ. 25 వేలతో పాటు రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అందులో ఒకరు స్థానిక పూచీకత్తుదారు అయి ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమతి లేకుండా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిని దాటి వెళ్లకూడదని ఆదేశించింది.

విజయవాడ కానూరులో అరెస్ట్

కాగా పక్కా సమాచారంతో గత నవంబర్‌ 18న విజయవాడ కానూరు ఆటో నగర్‌లో పోలీసులు సోదాలు చేశారు భవనంలో ఉన్న వీరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడంతో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నిందితులంతా దాదాపు 200 రోజులకు పైగానే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవించారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో మావోయిస్టుల తరపున పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 2న ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. తాజాగా ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం నిందితుల తరపు వాదనలను ఏకీభవించింది. ఈ మేరకు నలుగురు మావోయిస్టులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వాలు జారీ చేసింది. దీంతో ఈ నలుగురు కూడా సోమవారం విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

Next Story